స్వచ్ఛ్ భారత్ మిషన్
భారత ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రకటించిన “స్వచ్ఛ్ భారత్ మిషన్ ” పారిశుధ్య కార్యక్రమాలను సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 23 2014 వరకు ప్రతి గ్రామం, పట్టణం, నగరాల్లో నిర్వహించాలని సంబంధిత అధికారులకు ‘కేంద్ర తాగునీటి మరియు పారిశుధ్య నిర్వహణ మంత్రిత్వ శాఖ’ ఆదేశాలు జారీచేసింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 వరకు “స్వచ్ఛ్ పంచాయతి వారోత్సవాలు” ప్రతి గ్రామంలో నిర్వహించడం జరుగుతున్నది. గ్రామ పంచాయతి, గ్రామ సభలను ఒక తాటిపై నిలిపి గ్రామాల్లో పారిశుధ్య లక్ష్యాలను సాధించటానికి రోజువారీ కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రత, పారిశుధ్యాన్ని సాధించాలి.
ఈ వారోత్సవాల్లో చేపట్టవలసిన అంశాలు
మరియు ప్రధాన కార్యక్రమాలు:
1. ఈ వారంలో వివిధ రోజుల్లో
చేయాల్సిన కార్యక్రమాలు: గ్రామపంచాయితీల్లో sanitation
drive చేపట్టి ప్రజల ఇండ్లు, పరిసర ప్రాంతాలు, పశువుల కొట్టాలు..
స్కూల్స్, అంగన్వాడి, మార్కెట్ల వంటి ప్రజా రద్దీ స్థలాలను పరిశుభ్రం చేయించాలి. అలాగే
తాగునీటి సరఫరా చేసే ట్యాంకులను శుభ్ర పరిచి తాగునీటి సదుపాయాన్ని మెరుగు పరచాలి.
మురికి కాలువల్లో ఎక్కడైనా మురికి నిల్వ ఉండకుండా చేసి DDT స్ప్రే చేయించాలి.
చేయవలసిన ఇతర కార్యక్రమాల కోసం annex 1 చూడగలరు.
2. 2nd అక్టోబర్ 2014 నాడు ‘స్వచ్ఛ్
గ్రామ సభ’: ఈ వారంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాల
గురించి ఈ గ్రామ సభలో చర్చించి, ఈ వారంలో గ్రామ పరిశుభ్రతకు తమ సేవలంచిన
వ్యక్తులను గౌరవించాలి. ఈ రోజున గ్రామ పంచాయితీలో ఒక మొక్కని నాటాలి. ఈ గ్రామ సభ
మరియు గురించిన వివరాల గురించి Annex
2 & Annex 3 చూడగలరు.
3. గ్రామ పంచాయతి పారిశుధ్య
పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు: ఈ
వారంలో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించుటకు “సర్పంచ్” అధ్యక్షతన పారిశుధ్య
పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలో సర్పంచ్తో పాటు VHNC[1]
చైర్మన్, VWSC[2] చైర్మన్ మరియు రెండు లేదా
అంతకంటే ఎక్కువ మంది వార్డ్ సభ్యులు ఉండాలి. ఈ కమిటీలో ఉండే వార్డ్ సభ్యుల్లో ఒక
మహిళ, SC/ST సభ్యులు తప్పనిసరిగా ఉండాలి. ఈ రోజువారీ జరిగే కార్యక్రమాలను
పర్యవేక్షిస్తూ, మరుసటి రోజు కోసం ప్రణాళిక రూపొందించాలి. అక్టోబర్ 2 న జరిగే
గ్రామ సభలో ఈ కమిటీ తమ పారిశుధ్య పర్యవేక్షణ నివేదికను సమర్పించి, ఉత్తమ ప్రదర్శన
కనబరచిన వార్డులకు బహుమతులు అందించాలి.
4. స్వచ్ఛ్ పంచాయతి వారోత్సవాల
ప్రకటన:
ప్రభుత్వ పథకాల కార్యకర్తలైన ANM, AWW ASHA లతో పాటు గ్రామ పౌరులను గ్రామ పంచాయతి సెప్టెంబర్
25 నాడు సమావేశపరిచి ఈ వారోత్సవాలు ప్రారభించబోతునట్టు ప్రకటన చేయాలి. పంచాయతి
నోటిసు బోర్డు, పబ్లిక్ స్థలాల్లో ఈ వారోత్సవాల ప్రకటనను ప్రచురించాలి. ఈ వారంలో పారిశుధ్య నిర్వహణను ముందు ఉండి
నడిపించడానికి వాలంటీర్ల బృందాన్ని ఏర్పాటుచేయాలి. ఈ బృందంలో ప్రతి వార్డ్ నుంచి కనీసం
ఒక సభ్యుడు ఉండాలి. ప్రతి వార్డ్ లోని వాలంటీర్ల బృంద సభ్యుడికి నోడల్ పాయింట్స్
కేటాయించి జరిగిన పనిని అంచనా వేయలి. వారోత్సవాల్లో మొదటిరోజు పాదయాత్ర నిర్వహించి
గ్రామ ప్రజలకు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలను తెలియచేయాలి. ఈ పాదయాత్ర గ్రామంలోని
పారిశుధ్య పరమైన సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడానికి కూడా ఉపయోగపడుతుంది. పారిశుధ్యం
మొదలు పెట్టకు ముందు తీసిన ఫోటోగ్రాఫ్ ల సహాయంతో జరిగిన పనిని అంచనా వేయొచ్చు.
5 . ప్రభుత్వ అధికారుల హాజరు: గ్రామాల్లోని క్షేత్ర స్థాయి
అధికారులకు, ANM, అంగన్ వాడి, ఆశా కార్యకర్తలకు ఈ వారోత్సవాలు మరియు స్వచ్ఛ గ్రామ
సభ గూర్చి సమాచారం అందించి హాజర్ అయ్యే విధంగా చూడాలి. జిల్లా, మండల స్థాయి
అధికారులు కూడా ఈ వారోత్సవాలను సందర్శించి సలహాలు ఇవ్వడం గాని సమస్యల
పరిష్కారానికి కృషి చేయాలి.
6 . SHG[3], CBO[4].. ల
ప్రమేయం(పాత్ర): ఈ స్వచ్ఛ్ భారత్ మిషన్ ” పారిశుధ్య నిర్వహణ సఫలీకృతం అంతా
ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం మీదే ఆధారపడి ఉంది. కావున యువత, కమిటీ సభ్యులు,
ప్రత్యేకించి VHNC, VWSC లు,
భారత్ నిర్మాణ్ కార్యకర్తలు, స్వయం సహయక బృందాలు కీలక పాత్ర వహించి మిషన్
విజయానికి కృషి చేయాల్సి ఉంటుంది.
7 . చిత్రలేఖనం మరియు వ్యాస రచన పోటీలు: ‘పారిశుధ్యం’ అంశంపై స్కూల్స్ లోని విద్యార్థులకు,
గ్రామంలోని యువకులకు చిత్రలేఖన మరియు వ్యాస రచన పోటీలు నిర్వహించాలి.
8 . గ్రామసభ రోజున ‘స్వచ్ఛ భారత్’ లో పాల్గొన్నవారికి
గౌరవ సత్కారం: పారిశుధ్య
నిర్వహణలో స్వచ్ఛందంగా పాల్గొన్న వారిని 2014
అక్టోబర్ 2 న జరిగే గ్రామ సభలో సత్కరించాలి. అలాగే అన్ని వార్డుల్లో కెల్లా
మెరుగైన పారిశుధ్యాన్ని సాధించిన వార్డును ప్రశంసించాలి.
9 . స్వచ్ఛ్ పంచాయతి
వారోత్సవాల & స్వచ్ఛ్ గ్రామ సభ రికార్డు:
వారోత్సవాల్లో రోజువారీ కార్యక్రమాలపై ఫొటోలు తీసి భద్రపరచాలి. గ్రామసభలో జరిగిన
చర్చలు, తీర్మానాలను రికార్డు చేయాలి.
గ్రామ పంచాయితి కింది అంశాలపై నివేదిక తయారుచేయాలి.
i.
గ్రామ
పంచాయితికి సంబంధించిన బౌగోళిక పరిస్థితులు, జనాభా, కుటుంబాల సంఖ్య, పేదరిక రేఖకు
దిగువన ఉన్న కుటుంబాల సంఖ్య, SC/ST జనాభా.. తదితర వివరాలు.
ii.
స్వచ్ఛతకు
ముందు పారిశుధ్యం పరిస్థితి.
iii.
స్వచ్ఛత
వారోత్సవాల్లో చేపట్టిన రోజువారీ కార్యక్రమాలు.
iv.
వారోత్సవాల
అనంతరం పారిశుధ్య నిర్వహణ పరిస్థితి.
v.
గ్రామ
పంచాయతిలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంలో ఎదురైనా సవాళ్ళు.
vi.
ప్రజల
స్పందన.
vii.
పాలన
(వివిధ విభాగాల) సమన్వయం.
viii. గ్రామ పంచాయతిలో తదుపరి పారిశుధ్యానికి ప్రణాళిక
ix.
పారిశుధ్య
కార్యక్రమాలకు సంబంధించిన కొన్ని పొటోలు.
10. కార్యక్రమాల (చర్యా) ప్రణాళిక: గ్రామ సభ
జరిగిన వెంటనే తీర్మానాలపై చర్యలు, పారిశుధ్య అంశాలపై కాల పరిమితితో కూడిన ప్రణాళిక
ఏర్పాటు చేసుకోవాలి. PHED, RWSS, PHC,ASHA వంటి ప్రభుత్వ పథకాల కార్యకర్తలు,
క్షేత్ర స్థాయి అధికారుల సహకారంతో వ్యూహాలు, పరిష్కారాలను రూపొందించాలి. ఈ మిషన్
రిపోర్ట్ ను బ్లాక్ అభివృద్ధి అధికారి(MPDO)కు సమర్పించాలి.
‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ
కొరకు గ్రామ పంచాయితి తన సొంత రెవిన్యూ నుండి, కేంద్ర& రాష్ట్ర ఆర్థిక కమిషన్ల
గ్రాంట్లు, BRGF నిధుల నుండి ఖర్చు చేయాల్సి ఉంది. దీని కోసం నిధుల సమీకరణకు
విరాళాలు, చందాల సేకరణను ప్రోత్సహించాలి.
[1]
Village health, nutrition and sanitation committee
[2]
Village water and sanitation committee
[3]
Self help group
No comments:
Post a Comment